పుట:Womeninthesmrtis026349mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

స్మృతికాలపుస్త్రీలు

స్త్రీసంతతిపట్ల స్మృతులదృక్పధము నింతవఱకును జూచితిమి. ఇక స్త్రీసంతతియొక్క యుత్పత్తినిగూర్చి స్మృతికారులకుగల రెండభిప్రాయముల నిటతెల్పుట యప్రస్తుతము కాదు.

పురుషుని శుక్రాదిక్యముచే పురుషసంతతియు, స్తీ శోణితాధిక్యముచే స్త్రీసంతతియు గల్గునని మనుస్మృతి చెప్పుచున్నది.

పుమా-- సోథి కేశుక్రే స్త్రీభవశ్యధి కేస్త్రియా:

(మను 8-49)

కుమారునిలో తండ్రియంశమును కుమార్తెలో తల్లి యంశమును విశేషముగ నుండుటచేతనే వసిష్ఠుడు పతితుడైన పురుషునకు పతితురాలుకాని స్త్రీయందు జన్మించిన పుత్రుడే పతితుడగును. కాని కుమార్తె పతితురాలుకాదని చెప్పినాడు.

పతితేనోత్సన్న: పతితో భవతి అన్యత్రస్త్రియా:

(వసి 18-51)

(పతితుని స్త్రీకంటె నితరమగు సంతతి పతితమగు చున్నది)

మఱియు ఋతుకాలములో సరిసంఖ్యగల రాత్రులందు పురుషుడను బేసిసంఖ్యగల రాత్రులందు స్త్రీయును గర్భములో ప్రవేశించునని యీ క్రింది శ్లోకము చెప్పుచున్నది.

యుగ్మాసుపుత్రాజాయంతే స్త్రియోయుగ్మానురాత్రషు

(మను 3-48)
__________