పుట:Womeninthesmrtis026349mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాధ్యాయము

13

మతృప్తులగుదురట! శ్రాద్దమునకు కుతుపకాలము, తిలలు నెట్లు కావలెనో దౌహిత్రుడుకూడ నట్లే కావలెనట!

త్రీణ్యేతాని పవిత్రాణి దౌహిత్ర:కుతపస్తిలా:

(వసిష్ఠ: 1-35)

(దౌహిత్రుడు, కుతపకాలము, తిలలు - ఈమూడును శ్రాద్ధమునకుపవిత్రములు.)

కావుననే బ్రహ్మచర్యవ్రతములోనున్నను దౌహిత్రుని భోక్తగనియమింపవలెనను నియమముగలదు.

వ్రతస్థమపి దౌహిత్రంశ్రాద్ధేయ త్నేసభోజయేత్

(మను 3-234)

నిత్యమునుదకదానము చేయుటచేగూడ దౌహిత్రుడు మాతామహవంశ్యులలో ప్రేతులైనవారికి సేవకుడగుచున్నాడు.

ఏవంమాతామహాచార్య ప్రేతానాముదకక్రియా

(యాజ్ఞప్రాకాం. 4)

(సపిండులకువలెనే మాతామహుకును నాచార్యులకును నుదకదానము చేయవలెను.)

దౌహిత్రునివలన తనవంశమునకిట్టి ప్రయోజనముగల్గును గావున నే కన్యాదాత కన్యనిచ్చునపుడితర దానములలో వలె 'సమమ' 'ఇదినాదికాదు' యని చెప్పడు. అట్లుచెప్పుచో దత్తవస్తువుయొక్క ఫలమగు దౌహిత్రునివలన నాతడును నాతని వంశీయులును ప్రయోజనములనొందుటకు వీలుండక పోయెడివి.