పుట:Womeninthesmrtis026349mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

స్మృతికాలపుస్త్రీలు

    జ్యోతిష్టోమాదిపత్రాణాంశతం శతగుణీకృతం
    ప్రాప్నోతిపూరుషోదత్త్వాహోమమంత్రైస్తు సంస్కృతాం
    అలంకృత్యపితాకన్యాం భూషణాచ్ఛాదనాపనై:
    దత్వాస్వర్గమవాప్నోతి పూజితస్తు సురాదిషు.

(సంవర్త. 61, 62, 63, 64)

(అలంకరించిన కన్యను బ్రాహ్మవివాహముచేత తగిన వరునకిచ్చుచో వాడు మిక్కిలి శ్రేయస్సును, కీర్తిని, సజ్జనవస్తుతిని పొందును; జ్యోతిష్టోమాదియాగముల ఫలమునకు నూరు రెట్లు ఫలము నొందును. హోమమంత్రములచే సంస్కరింప బడిన కన్యను భూషణచ్ఛాదనాసనములచే నలంకరించి యిచ్చువాడు స్వర్గమునొంది దేవతలలో పూజింపబడును.)

కుమార్తె తనతండ్రికిని నాతని వంశమునకును నెంత మహోపకారిణి కాగలచో పైన నుల్లేఖింపబడిన వాక్యములను బట్టి స్పష్టము కాగలదు. స్మృతికారులు స్త్రీ సంతతి కెంత ప్రాశస్త్యమును గల్పించినారో యిట్టివాక్యములవలన స్పష్టమగుచున్నది.

కుమార్తె కేవలము తానేకాక తన సంతతిద్వారమున గూడ పితృవంశమునకు మహోపకృతి సల్పుచున్నది. ఏమన: సామాన్యుడగు (పుత్రికా పుత్రుడుకాని) దౌహిత్రునిమూలమున గూడ మాతామహుని వంశము తరించుచున్నదని స్మృతుల యభిప్రాయము. దౌహిత్రుడనిన పితృదేవతల కెంతయో ప్రీతియట! శ్రాద్ధములో నాతని భుజింపజేసినచో వారు పర