పుట:Womeninthesmrtis026349mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాధ్యాయము

11

గ్నిష్టో మాతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజిపేయ పౌండరీ కాశ్వమేధాది శతక్రతు పుణ్యఫలా వాప్త్యర్థం మయాసహదశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితౄణాం నరకాదు త్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం.....సాలంకృత కన్యాదానం......కరిష్యే.

(సూర్య మండలము వఱకును నువ్వులను, ప్రోగువేసి యందుండి వేయిసంవత్సరముల కొకగింజను తీసివైచు చుండినచో నెంతకాలము కాప్రోగు పూర్తిగ తీయబడునో యంత కాలము బ్రహ్మలోకములో నుండుటకును, త్రిగుణీకృతాగ్నిష్టో మాతిరాత్రాప్తోర్యామ సాంతపవ వాజిపేయ పౌండరీ కాశ్వమేధాధి శతక్రతు పుణ్యఫలము గల్గుట కొఱకును, మావంశమునందును మాతృవంశమునందును నాతోకూడ పది తరముల పై వారును పదితరముల క్రిందివారునునగు పితరులు నరకమునుండి లేచి శాశ్వత బ్రహ్మలోక నివాసమును పొందుటకును.......సాలంకృత కన్యాదానమును చేయుచున్నాను.)

ఇంత యత్యుక్తులతో గాకున్నను సంవర్తస్మృతి కన్యాదానమున కీ క్రింది ఫలమును జెప్పుచున్నది.


    అలంకృత్యతుయ: కన్యాం పరాయసదృశాయవై
    బ్రాహ్మేణవిహాహేన దద్యాత్తాన్తుసు పూజితాం
    సకన్యాయా: ప్రచానేనశ్రేయోవిందతి పుష్కలం
    సాథువాదం లభేత్సద్భి:కీర్తిం ప్రాప్నోతిపుష్కలాం