పుట:Womeninthesmrtis026349mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

స్మృతికాలపుస్త్రీలు

క్షేత్రమందును, పుణ్యతీర్థమందును కన్యను దానము చేయువాడు మోక్షము నొందును. అతని పితృదేవ గణములు బాగుగ పూజింపబడిన వగుచున్నవి. ఆగణములు గంధర్వుల చేత స్తుతింపబడుచున్నవైనా (విష్ణుని) మందిరమునకు వచ్చును.

యాజుషస్మార్తాను క్రమణిణిలో గూడ కన్యాదాన ఫలము పేర్కొనబడినది.

దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగిషయా

(బ్రహ్మలోక కాంక్షతో విష్ణుస్వరూపుడవగు నీకు కన్యనిచ్చుచున్నాను.)

త్వద్దానాన్మోక్ష మావ్నుయాం

(ఓకన్యా, నిన్ను దానము చేయుటచే మోక్షము నొందగలను)

కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై

(పితృదేవతలు తరించుటకై యీ కన్యను దానము చేయుచున్నాను.)

మహాసంకల్పములో పారవశ్యముతో వినుతింపబడిన కన్యాదాన మహాఫలము తెలియుటకై యందుండి కొన్ని భాగముల నిచ్చుచున్నాడను.

తిలై:స్సూర్య మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాప కర్షక్రమేణ సర్వరాశ్యపకర్ష సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం......త్రిగుణీకృతా