పుట:Womeninthesmrtis026349mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాధ్యాయము

9

గలవాడు పుణ్యాత్ముడనియే స్మృతులయభిప్రాయము. కన్యాదానమాత్రముచేతనే తండ్రియునాతని పితృదేవతలును తరించు చున్నారని యర్వాచీనగ్రంథములలో చెప్పబడినది. మఱియు (పుత్రిక కాని) సామాస్యదుహితయొక్క కుమారుడుకూడ మాతామహుని యాతనిపితురులను మిక్కిలి సంతుష్టులను చేయగలడని స్మృతులలో తెల్పబడినది. కన్యాధానఫలము శేషధర్మములలో నీక్రిందివిధముగ తెల్పబడినది:

   సురూపాయ కులీనాయ సుశీలాయహ్యగోగిణే
   కన్యాందద్యా చ్ఛుభాన్లోకాన్లభతే నాత్రసంశయ:
   సుశ్రుతాయ దరిద్రాయ శ్రోత్రియస్యాత్మ జాయచ
   యోదద్యాచ్చ స్వకాంకన్యాం బ్రహ్మలోకంస గచ్ఛతి
                       (శేషధర్మము 8 అధ్యా, 6, 7.)
  
   విష్ణువాయన సంక్రాంతౌ చంద్రసూర్యోపరాగయో:
   పుణ్యక్షేత్రే పుణ్యతీర్థే కన్యాదో మోక్ష మశ్నుతే
   పిట్ర్ దేవగణా స్తవ్య భవంతి హిసుపూజితా:
   గంధర్వైస్తూయ మానాన్తే ప్రయాంతి మమమందిరం
                       (శేషధ. 8-9.10)

(మంచి రూపకుల శీలారోగ్యములు గలవానికి కన్య నిచ్చినవానికి శుభలోకములు లభించుటలో సందేహములేదు. వేదము చదువుకొనినట్టియు, దరిద్రుడైనట్టియు శ్రోత్రియ పుత్రునకు తన కన్యనిచ్చువాడు బ్రహ్మలోకమును పొందును. సంక్రాంతియందును, సూర్య చంద్రగ్రహణములందును, పుణ్య