పుట:Womeninthesmrtis026349mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

స్మృతికాలపుస్త్రీలు

అభిసంధిమాత్రాత్పుత్రికేత్యేకే

(గౌతమ: 29-19)

(3) నోటిమాటచేత నియమములేకున్ననుగూడ సభ్రాతృకన్య పుత్రికయే కావచ్చునని కొన్ని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. ఇచటకన్యాదాత యభిప్రాయమేకాని వరుని సమ్మతి యవశ్యముకాదు. కావుననే పుత్రికాకరణము ప్రత్యక్షముగ జరుగకున్ననుకూడ సభ్రాతృకన్యను వివాహమాడరాదని చెప్పబడినది

తత్సంశయాన్నోపయచ్ఛేదభ్రాతృకాం

(గౌ ఎమ,29-30)

(పుత్రికగ పరిగణింపబడు నేమోయనుభయముచే సభ్రాతృకన్యను వివాహమాడరాదు.)

లిఖితస్మృతియు మనుస్మృతియుకూడ నీయభిప్రాయమునే యీక్రిందివిధముగ వెల్లడించినవి.

యస్యాస్తుస వేదభ్రాతా సవిజ్ఞాయేత వాపితా

నోపయాచ్ఛేతతాం ప్రాజ్ఞ: పుత్రికాకర్మశంకయా

(లిఖిత 8-51)

యస్యాస్తుసభవేద్ర్భాతా నవిజ్ఞాయేతవాపితా

నోపయచ్ఛేతతాంప్రాజ్ఞ:పుత్రికాధర్మశంకయా

(మను 3-11)

భ్రాతృహీనమగు స్త్రీసంతతినిగూర్చి యింతవఱకును విచారించితిమి. ఇక భ్రాతృసహితమగు స్త్రీసంతతివలని ప్రయోజనముల నించుకపరికింతము. ఇట్లుచూచిననుగూడ నాడుపిల్ల