పుట:Womeninthesmrtis026349mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

స్మృతికాలపుస్త్రీలు

(5) వివాహము కాకుండగనే రజస్వలయైన స్త్రీయు నామె పెద్దలును నామె సంతతియుగూడ పతితులగుదురని కొన్ని ధర్మశాస్త్రములును, పెద్దలుమాత్రమే దోషవంతులగుదురని కొన్ని ధర్మశాస్త్రములును చెప్పుచున్నవి.

ఈ సిద్ధాంన్తములలో నొక్కొక్కదానిని తీసికొని యందులకుగల యాధారములను పరికింతము.

(1) వసిష్ఠధర్మశాస్త్రము, గౌతమధర్మసూత్రము, పరాశరస్మృతి, యమసంహిత, సంవర్తసంహిత, యాజ్ఞవల్క్యస్మృతియను నాఱుధర్మశాస్త్రములును నిస్పష్టముగ రజస్వలావివాహము చేయువానిని గర్హించుచున్నవి.


   పితు:ప్రమాదాత్తు యదీహకన్యా
   వయ:ప్రమాణం సమతీత్యదీయతే
   సాహన్తిదాతారము దీక్షమాణా
   కాలాతిరిక్తాగురు దక్షిణేవ (వసి 17-69)

తండ్రి పొరబాటువలన నే కన్య వివాహవయస్సు నతిక్రమించి దానముచేయబడునో యాకన్య సకాలమును దాటిన గురుదక్షిణవలె దాతను నశింపజేయును)

పైశ్లోకములో నుద్దేశింపబడిన వివాహవయస్సు నీక్రింది శ్లోకము విశదీకరించుచున్నది.


    ప్రయచ్ఛేన్నగ్నికాం కన్యామృతుకాలభ యాత్పితా
    ఋతుమత్యాంతుతిష్ఠన్త్యాం దోషం పితరమృచ్ఛతి
                                        (వసి. 17-70)