పుట:Womeninthesmrtis026349mbp.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

స్మృతికాలపుస్త్రీలు

నాతండ్రి బాగుచేయును గాక' యను మంత్రము స్త్రీలు మానసికముగ వ్యభిచరించువా రనుకొనుట కొక నిదర్సనము.)

    ధ్యాయత్యనిష్టం యత్కించిత్పాణిగ్రాహస్యచేతసా
    తస్యైషవ్యభిచారస్య నిహ్నవస్స మ్యగుచ్యతే
(మను. 9-21)

(స్త్రీ భర్తకేదైన యనిష్టము తలబెట్టుచో నావ్యభిచారమున కీ మంత్రము ప్రాయశ్చిత్తముగ చెప్పబడినది.)

ఇక స్త్రీలు స్వభావముచేత వ్యభిచారిణులను మను వాక్యమును చూతుము.

    నైతారూపం పరీక్షన్తే నాసాం వయసి సంస్థితిః
    సురూపం వా విరూపం వా పుమానిత్యేవభుంజతే
(మను. 9-14)

(ఈ స్త్రీలు రూపము చూడరు. వయస్సు విషయమై వీరికి పట్టుదల లేదు. సురూపుడైనను సరియే కురూపుడైనను సరియే పురుషుడైనంత మాత్రమున వీరనుభవింతురు)

    పౌంశ్చల్యాచ్చలచిత్తాచ్చ నై స్నేహాచ్చ స్వభావతః
    రక్షితా యత్నతో౽పీహ భర్తృష్వేతా వికుర్వతే
(మను. 9-15)

(స్త్రీలు పురుషుని చూడగనే చలించు స్వభావముగల వారు గావునను స్నేహభావము లేనివారు గావునను, మనస్సు నిలకడ లేనివారు గావునను వారి నెంతగరక్షించినను నింకను భర్తపట్ల తిన్నగ ప్రవర్తింపకుండగనే యుందురు.)