పుట:Womeninthesmrtis026349mbp.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశాధ్యాయము

191

ఒకసారి వ్యభిచరించిన దిక నెన్నిసారులైనను వ్యభిచరించునుగాన నకృద్వ్యభిచారిణిని గూడ వదలివేయవలెనని పరాశరుని మతము.

    బ్రాహ్మణీతుయదాగచ్ఛేత్పరం పుంసావిసర్జితా
    గత్వాపుంసశ్శతం యాతిత్యజేయుస్తాంతుగోత్రిణః
(9-35)

ఈ రజస్స్రానము చేత శుద్ధియగునది మానసిక వ్యభిచారమే కాని కాయికవ్యభిచారము కాదని కొన్ని స్మృతుల యభిప్రాయము.

రజసాస్త్రీ మనోదుష్టాసన్యాసేన ద్విజోత్తమః

(మను. 4-106)

(మానసిక వ్యభిచారము చేసిన స్త్రీరజస్సుచేతను ద్విజుడు సన్యాసము చేతను పరిశుద్ధులగుదురు)

తల్లి మానసిక వ్యభిచారమునకై కుమారునికి ప్రాయశ్చిత్తమున కక్కరకువచ్చు మంత్రము మనుస్మృతిలో చూపబడినది. ఈమంత్రమును బట్టి స్త్రీలు స్వభావముచే వ్యభిచారిణులని మనుస్మృతి చెప్పుచున్నది.

    యన్మేమాతాప్రలులుభే విచరంత్యపతివ్రతా
    తన్మేరేతః పితావృజ్త్కామిత్యస్యైతన్నిదర్శనం
(మను. 9-20)

('నాతల్లి యపతివ్రతయై మానసికముగ వ్యభిచరించి రజస్సున పరిశుద్ధము చేసికొనెనను నదేదికలదో దానిని