పుట:Womeninthesmrtis026349mbp.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశాధ్యాయము

193

స్త్రీల స్వభావమిట్టిది కావునను పురుషులకు కూడ నింద్రియజయము దుర్లభము కావునను స్త్రీపురుషులకు సంబంధము లేకుండ చేయవలెనని మనుస్మృతి యభిప్రాయము.

     ఏవంస్వభావం జ్ఞాత్వాసాం ప్రజాపతినిసర్గజం
     పరమం యత్న మాతిష్ఠేత్ పురుషోరక్షణంప్రతి
(మను. 9-16)

(బ్రహ్మ కల్పించిన స్త్రీ స్వభావమును గ్రహించి పురుషుడు స్త్రీని రక్షించుటకు గొప్ప ప్రయత్నము చేయవలెను.)

    మాత్రాన్వస్రాదుహిత్రావాన వివిక్తాననో భవేత్
    బలవానింద్రియగ్రామో విద్వాంసమపికర్షతి
(మను. 2-215)

(తల్లితోను, సోదరితోను, కుమార్తెలతోను గూడ నేకాంతప్రదేశమున నుండరాదు. బలవంతమగు నింద్రియ సమూహము విద్వాంసుని గూడ నాకర్షించును.)

భార్య చెడిపోవుటచే భర్తయొక్క యిహపరసుఖ మంతయు నశించుచున్నది. కావున నెట్టివాడయినను భార్యను రక్షించుకొనక తప్పదు. భార్యతోనే యిహపరసుఖ మున్నదను నంశము దాంపత్యమను నధ్యాయమున వివరింపబడినది.

    సూక్ష్మేభ్యోపి వ్రసంగేభ్యః స్త్రియారక్ష్యా విశేషతః
    ద్వయోర్హికులయోశ్శోకమావహే యురరక్షితాః
    ఇమం హి సర్వవర్ణానాం పశ్యన్తో ధర్మముత్తమం