పుట:Womeninthesmrtis026349mbp.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశమాధ్యాయము

183

మున్నగు నమంత్రక కర్మలును నని వ్యాఖ్యాతలు చెప్పుచున్నారు.

భార్య మున్నగువారు మరణించునపుడు చేయవలసిన కర్మకలాపమును వివరించుచు నాపస్తంబు డిట్లు చెప్పుచున్నాడు.

    తత్ప్రత్యయముదక ముత్సిచ్యాప్రతీక్షాగ్రామ
    మేత్యయత్ స్త్రియ ఆహుస్తత్కుర్వన్తి
(ఆ.ధ.సూ. 2-15-19)

(ఈ యుదకము తమకే విడువబడినదని నమ్మకము గల్గు విధమున నుదకదానము చేసి వెనుకకు చూడకుండ గ్రామములోనికి వచ్చి స్త్రీ లేదిచెప్పిన దానిని చేయవలెను.)

ప్రస్తుత మలభ్యములై యున్న శ్రుతిస్మృతులలోని ధర్మములను కొన్నిటిని స్త్రీసంఘ ముపదేశింపగలదని యీ విధముగ తేలుచున్నది. ఇంతేకాక శ్రుతిస్మృతులలో స్త్రీల కొఱకై చెప్పబడిన ధర్మములనైనను వారెఱిగియుండవలెను. కాన పురుషులవలె కాకపోయినను స్త్రీలేదో యొక విధమున విద్య నార్జించుచుండెడివారని చెప్పవలసి యున్నది.

స్మృతులలో స్త్రీల కళాశిల్పవిషయిక ప్రవేశ మొకింత గోచరించుచున్నది. నృత్యగానములలో స్త్రీలకు ప్రవేశముండెననియు వారిలో కొందఱీ నృత్యగానములను పురుషులతో గలసి చేసెడివారనియు నూహించుటకు మనుస్మృతిలోని