పుట:Womeninthesmrtis026349mbp.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

స్మృతికాలపుస్త్రీలు

సానిష్ఠా విద్యాస్త్రీషు శూద్రేషుచ

(ఆ.ధ.సూ.2-29-11)

ఆవిద్య యాధర్వణ వేదముయొక్క శేషమని చెప్పుదురట.

ఆథర్వణస్య వేదస్య శేషఇత్యుపదిశంతి

(ఆ.ధ.సూ. 2-29-11)

కావున

    స్త్రీభ్యస్సర్వవర్ణేభ్యశ్చ ధర్మశేషాన్ ప్రతీయా
    దిత్యేక ఇత్యేవే
(ఆ.ధ.సూ. 2-29-15)

సమస్తవర్ణ స్త్రీలనుండియు మిగిలిన ధర్మములను తెలిసి కొనవలెనని కొందఱు చెప్పుచున్నారు.

కొన్ని కర్మలను కూడ స్త్రీలనుండి తెలిసికొనవలెను. ఆపస్తంబుడు గృహసూత్రములో వివాహసంస్కారమును వర్ణించుచు తాను చెప్పుదానినే కాక స్త్రీలుచెప్పు మఱికొన్నిటిని గూడ చేయవలెనని యాదేశించుచున్నాడు.

ఆవృతశ్చాస్త్రీభ్యః ప్రతీయేరన్

(ఆ.గృ.సూ. 1-2-15)

(వివాహసంబంధములైన కర్మలను స్త్రీలనుండి తెలిసికొని చేయవలెను.)

ఇచట 'కర్మ'లనగా గృహసూత్రములో చెప్పబడిని యంకురారోవణము మున్నగు నమంత్రక కర్మలును, నాకబలి