పుట:Womeninthesmrtis026349mbp.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశమాధ్యాయము

181

లోపలనే యుండు స్త్రీలు కొంద ఱుండిరి. అట్టివారు ముఖ్యముగ ధనికులై యుందురు. అంతఃపురముల ప్రశంసస్మృతులలో కొన్నిచోట్లవచ్చును.

అంతఃపురప్రచారం చ

(మను. 7-153)

(రాజు చారులవలన నంతఃపురములోని యంశములను గూడ తెలిసికొనవలెను.)

పైన వివరింపబడినట్లు స్త్రీలు గృహముకొఱకే పుట్టి యుండుటచేతను బాహ్య ప్రపంచములో పనిచేయుటకు వారనర్హలు కావునను సమస్త విషయములలోను వారు భర్తననుసరింపవలసినవారే యగుటచేతను వారికి విద్య యక్కరలేదనియే స్మృతికారు లభిప్రాయపడిరి. బాలునకు వేదము చదువుటయను విధియుండగా బాలిక కట్టివిధి లేకపోవుటయే కాక యామెకు భర్తృశుశ్రూషయే గురుకుల వాసము గృహకృత్యమే యగ్ని కార్యమునని చెప్పబడినట్లు చూచియున్నాము. వారికి సక్రమమైన విద్య లేదేకాని విజ్ఞానము లేక పోలేదు. పారంపర్యముగ వచ్చుచుండు ననేకాచారములును ధర్మములును, పురుషులెఱుగని వానిని కూడ, స్త్రీ లెఱుగుదురని యాపస్తంబుడు చెప్పుచున్నాడు. ఆతడు ధర్మములను చెప్పి చెప్పి తుదకా ధర్మశాస్త్రము పూర్ణముకాదనియు స్త్రీల యందును శూద్రుల యందును కొంత విద్య యున్నదనియు నుడివినాడు.