పుట:Womeninthesmrtis026349mbp.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

స్మృతికాలపుస్త్రీలు

ద్రోహభావంకుచర్యాం చస్త్రీభ్యో మనురకల్పయత్

(మను. 9-17)

(ద్రోహభావమును, చెడ్డపనులను మనువు స్త్రీలకొఱకు కల్పించెను.)

కాని స్త్రీల విషయములో మాత్రము స్త్రీలే సాక్షులుగ నుండవలెను.

స్త్రీణాం సాక్షిణః స్త్రియః

(యాజ్ఞ 2-30)

స్త్రీలు గృహమును కనిపెట్టుకొని యుండవలసిన వారగుటచే వారిని న్యాయస్థానములకు త్రిప్పుటవలన నష్టముండునను నూహ కూడ వారు సాక్షులుగ నుండుటకు తగరని చెప్పుట కొక కారణమై యుండవచ్చును. స్త్రీల యభియోగములను న్యాయాధికారి త్వరలో పరిష్కరింప వలెననుటకు కూడ నిదియే కారణము కావచ్చును.

ధేన్వనడుత్ స్త్రీ ప్రజనన సయుక్తేన

(గౌ. 13-29)

(ఆవులు, ఎద్దులు, స్త్రీలు, పిల్లలు-వీరితో కూడిన యభియోగములను త్వరలో పరిష్కరింపవలెను.)

బాహ్యప్రపంచముతో కొంచెము సంబంధ మున్నను మొత్తముమీద స్త్రీకి గృహమే ముఖ్యస్థానమనుట స్పష్టము. బాహ్యప్రపంచములోని కెన్నడును రాక కేవలము గృహము