పుట:Womeninthesmrtis026349mbp.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

స్మృతికాలపుస్త్రీలు

రజస్వలతో నృత్యగానములను సలుపరాదను నిషేధమే యాధారముగ నున్నది.

ననృత్యేదధవాగాయయేత్

(మను.8-64)

స్త్రీల ప్రకృతిపట్ల స్మృతికారులకు గల యభిప్రాయముల ననుసరించియే స్త్రీల వృత్తులను వారు నిర్ణయించినట్లు కన్పట్టును.

శయ్యాసన మలంకారం కామంక్రోధమనార్జవం'

(మను. 9-17)

(శయ్య, ఆసనము, అలంకారము, కామము, క్రోధము, వక్రవర్తనము.)

ఇవి స్త్రీలకుగల కొన్ని ముఖ్యలక్షణములుగ చెప్పబడినవి. కావుననే వారికి లోకములోని యున్నతకార్యములతో నేమియు సంబంధము కల్పింపబడక గృహనిర్వహణధర్మమే విధింపబడినది. అదియైనను పురుషుని యాధిపత్యమునకు లోనయియే యున్నది.

_______