పుట:Womeninthesmrtis026349mbp.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశమాధ్యాయము

175

అనపత్యాతు యానారీనాశ్నీయాత్తర్గృహేపివై

స్త్రీకి పతిసేవయే గురుకులవాసము, గృహకృత్యములు చేసికొనుటయే యగ్ని కార్యమునని యిదివఱలో సూచియుంటిమి. ఆమెకుగల నైపుణ్యమును, బుద్ధిని వినియోగించి గృహమును భూలోక స్వర్గము చేయుటయే యామెవిధి. ఆమె నిత్యము కలకలలాడుచు గృహము నంతయు ప్రకాశవంతముగ చేయవలెను. అట్లు చేయునపుడే స్త్రీలకు పైన వాడబడిన 'గృహదీప్తయః' అను విశేషణము సార్థకమగును. చీకటి దుఃఖమునకు చిహ్నము. వెలుగు సుఖమునకు సంతోషమునకు చిహ్నము. కాన వెలుగుతెచ్చు దీపముతో పోల్పబడిన స్త్రీ యింటికి సంతోషమును గూర్పవలెను. తా నసంతృప్తురాలై రోజుకొనుచునుండుచో నితరులకు సంతోషమును గలుగ జేయుటకు బదులు విచారమును గలుగజేయును. కాన నామె యెల్లపుడు సంతోషముతో నుండవలెను. మనుస్మృతి యీ యంశమును స్పష్టముగ చెప్పుచున్నది.

సదాప్రహృష్టయా భావ్యం గృహకార్యేషు దక్షయా

(మను. 5-150)

(గృహిణి యెల్లపుడు సంతోషించునదిగ నుండవలెను. గృహకృత్యముల జేయుటలో సమర్థురాలై యుండవలెను.)

ఎంత యోగ్యురాలైనను పనిచేత కానిదగుచో నింటిలోనివారిని సుఖపెట్టలేదు. కాన పనులలో నేర్పును సంపా