పుట:Womeninthesmrtis026349mbp.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

దశమాధ్యాయము

వృత్తి విద్య

స్త్రీల వృత్తి మనుస్మృతిలో సంగ్రహముగ నిట్లు చెప్పబడినది:

ప్రజనార్థం మహాభాగాః పూజార్హాగృహదీప్తయః

(మను. 9-26)

ఉత్పాదనమపత్యస్య జాతస్య పరిపాలనం
ప్రత్యహం లోకయాత్రాయాః ప్రత్యక్షం స్త్రీనిబంధనం
(మను. 9-27)

(స్త్రీలు సంతానముకొఱ కున్నారు. సౌభాగ్యవంతురాండ్రు గృహమునకు దీపములవంటివారు. పూజార్హులు. సంతానము కనుటయు, పోషించుటయు వారి కృత్యములు. ప్రతి దినము భర్త, యతిథి మున్నగువారి లోకయాత్రకు వారే కారణము)

స్త్రీకి సంతానము కనుట పెంచుట యంత ముఖ్యధర్మములు కావుననే సంతానములేని స్త్రీ యింట నన్నము తినరాదను నియమము మనుస్మృతిలో నున్నది.