పుట:Womeninthesmrtis026349mbp.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమాధ్యాయము

173

(భార్య కుపపతి యుండుటను సహించువారితోను, స్త్రీలచేత జయింపబడిన వారితోను నెన్నడును భుజింపరాదు.)

స్త్రీ గౌరవార్హయే యైనను నామె యెల్లపుడును పురుషుని యధీనముననే యుండవలెనని యీవిధముగ తేలుచున్నది. సంగ్రహముగ చెప్పవలెనన్నచో స్త్రీని పురుషుడు సగౌరవముగ కాపాడవలెనని చెప్పవలెను. పాశ్చాత్యదేశములలో 'షివల్రీ' యని చెప్పబడినది స్మృతులలో గలదని పైన నీయబడిన యుదాహరణములవలన వ్యక్తమగుచున్నది. దీని యవధి యీ క్రింది శ్లోకములో గలదు.

స్త్రీవిప్రాభ్యుపవత్తౌచఘ్నన్ ధర్మేణనదుష్యతి,

మను. 8-349)

(స్త్రీలను బ్రాహ్మణులను విపత్తునుండి తప్పించునపు డెవరినైనను చంపినను దోషములేదు.)


______