పుట:Womeninthesmrtis026349mbp.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

స్మృతికాలపుస్త్రీలు

దించుట కూడ స్త్రీకి విధియే. శిశువులను శుభ్రముగ నుంచుటయు నెవరి కేమి కావలసినదియు కనిపెట్టి చూచుచుండుటయు నందఱకు భోజనములు పెట్టుటయు నింటిలోని వస్తువులను భద్రపఱచుటయు నామె కృత్యములు.

శౌచేధర్మేన్న వఙ్త్యాంచ పారిణహ్యస్యచేక్షణే

(మను. 9-11)

అతిథులకును నింటిలోని యితరులకును పరిచారకులకును భోజనము పెట్టి తుదను గృహిణియు గృహస్థుడును భుజింపవలెను.

శేషం దమ్పతీ భుంజీయాతాం

(వసిష్ఠ. 10-6)

అపుడైనను గృహస్థునకు బిమ్మటనే గృహిణి భుజింప వలెను. భార్యాభర్తలిరువురును గలసి భుజింపరాదు.

    భర్యాయాసహనాశ్నీ యాదవీర్యవదపత్యం
    భవతీతివాజననేయకే విజ్ఞాయతే
(వసిష్ఠ 10-31)

(భార్యతోకూడ భుజించుచో సంతతి వీర్యరహిత మగును గాన నట్లు భుజింపరాదని వాజసనేయసంహిత చెప్పుచున్నది.)

అతిథి మున్నగువారికి భోజనమును బెట్టుటలో గూడ వారి వారి హెచ్చుతగ్గుల నాలోచించి ముందు వెనుకల వారిని భుజింపజేయవలెను.