పుట:Womeninthesmrtis026349mbp.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమాధ్యాయము

171

భర్త జీవించియున్నంత కాలము భార్య యాతని కన్నివిధముల ననువర్తనగ నుండవలెనను నంశమును దాంపత్యమను నధ్యాయమున చూచియున్నాము. బాల్యములో తండ్రివిషయమున నొక సందర్భములో కుమార్తె స్వాతంత్య్రమును వహింపవచ్చునను నంశము 'వివాహ కాలము' 'వివాహ విధానము' అనునధ్యాయములలో చూచియుంటిమి. రజస్వల యైన మూడుమాసములలో గాని కొన్ని స్మృతుల ననుసరించి మూడు సంవత్సరములలో గాని తండ్రి కన్యను దానము చేయనిచో నామె స్వయముగ నెవరినైన వరించుకొనవచ్చునను నంశమును చూచియుంటిమి. అట్లే గాంధర్వవివాహములో నామెకు గల స్వాతంత్య్రమును గూడ చూచియుంటిమి.

స్త్రీలకు స్వాతంత్య్రము లేకుండుట యన వారికి గౌరవములేకుండుట యని భావించుటకు వీలులేదు. ఈలోకములో నందఱకంటె నెక్కుడు పూజ్యురాలు, నిహదైవతమునని చెప్పబడిన తల్లియే కుమారుని వశముననుండవలెనని స్మృతులు చెప్పుటచేతనే యీయంశము స్పష్టమగు చున్నది. అనగా వారిక్షేమము నాలోచించియే వారికి స్వాతంత్య్రము నిషేధింపబడినదని తేలుచున్నది.

  
    స్వాతంత్య్రా ద్విప్రణశ్యనికులే జాతాఅపిస్త్రియః
    అస్వాతంత్య్రమతస్తా సాంప్రజాపతిరకల్పయత్
(నారద. 12-30)