పుట:Womeninthesmrtis026349mbp.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

స్మృతికాలపుస్త్రీలు

నిర్లక్ష్యము చేయరాదను నంశము పూర్వాధ్యాయములలో చూచియున్నాము. పిల్లలకు పేర్లను పెట్టుట మున్నగు నంశములలో గూడ నామె యభిప్రాయమును తీసికొనవలెను.

    దశమ్యాముత్థితాయాగ్ స్నాతాయాం పుత్రస్య
    నామదధాతి పితామా తేతి
(ఆ.గృ. 15-6-8)

(పదవనాడు స్నానమైన పిమ్మట తలిదండ్రులు పుత్రునకు పేరు పెట్టవలెను.)

భర్తచనిపోయి పుత్రులులేకుండినగాని ప్రాజ్ఞులు గాకుండిన కాని స్త్రీకి భర్తృపక్షమువారే ప్రభువులగుదురుగాని పితృపక్షమునవారుకారు.

    మృతేభర్తర్యపుత్రాయాః పతిపక్షః ప్రభుః స్త్రియాః
    వినియోగాత్మరక్షాను భరణేచసఈశ్వరః
    పరిక్షేణేపతికులే నిర్మానుష్యేనిరాశ్రయే
    తత్సపిండేషువాసత్సు పితృపక్షఃప్రభుస్త్రియాః
(నారద. 12-28, 29)

(భర్తపోయిన యపుత్రకు పతిపక్షము వారే ప్రభువులు. నియోగము, ఆత్మరక్ష, పోషణయను విషయములలో వారే యామె కధికారులు. పతికులమంతయు నశించి నిర్మానుష్యము నిరాశ్రయము నైనచో పతియొక్క సపిండులు గాని తండ్రిపక్షమువారు గాని ప్రభువులగుదురు.)