పుట:Womeninthesmrtis026349mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమాధ్యాయము

169

ముగ స్త్రీ కధికారము లేదు. కాని భర్త యనుజ్ఞనిచ్చుచో నామె కాయధికారము గల్గును.

    సస్త్రీపుత్రం దద్యాత్ప్రతిదృహ్ణీయాద్వాన్య
    త్రానుజ్ఞానాద్భర్తుః
( వసిష్ఠ. 15-5)

(భర్త యనుజ్ఞనిచ్చిననే కాని స్త్రీకి పుత్రుని దానము చేయుటకు గాని ప్రతిగ్రహణము చేయుటకు గాని యధికారము లేదు.)

మనుస్మృతి మున్నగు కొన్ని స్మృతులు తండ్రి కాని తల్లి కాని పుత్రుని దానము చేయవచ్చునని చెప్పుచున్నవే కాని యామె భర్త్రాజ్ఞను పొందుట మాట చెప్పుటలేదు.

    మాతాపితావాదద్యాతాం యమద్భిః పుత్రమాపది
    సదృశం ప్రీతిసంయుక్తం సజ్ఞేయోదత్త్రిమః స్మృతః
(మను. 9-168)

లౌకిక వ్యవహారములలో కూడ స్త్రీకి స్వాతంత్య్రము లేదు. భర్త యనుమతిలేకుండ స్త్రీ న్యాయస్థానములో నభియోగము కూడ తేరాదు. అట్టి యభియోగములను న్యాయాధికారి విచారించి తీర్పు చెప్పినను నాతీర్పు చెల్లదు.

స్త్రీనక్తషుం తరాగారబహశ్శత్రుకృతాం స్తథా

(యాజ్ఞ. 2-31)

సాధారణముగ భర్త భార్యతో నాలోచించియే గృహకృత్యములను నిర్ణయింపవలెను గాని కేవలము నామెను