పుట:Womeninthesmrtis026349mbp.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

స్మృతికాలపుస్త్రీలు

     పిత్రాభర్త్రాసుతైర్వాపి నేచ్ఛేద్విరహమాత్మన:
     ఏషాం హివిరహేణస్త్రీ గర్హ్యేకుర్యాదుభేకులే
(మను. 3-149)

సత్కార్యములను జేయుటకు గూడ స్త్రీ భర్త యనుమతిని పొందవలెను.

    అపృష్ట్వాచైవ భర్తారం యానారీకురుతేవ్రతం
    సర్వం తద్రాక్షసాన్గచ్ఛేదిత్యేవం మనురబ్రవీత్
(పరాశర. 4-18)

(భర్త నడుగకుండ స్త్రీ వ్రతముచేయుచో నావ్రతము రాక్షసులను జెందునని మనువు చెప్పినాడు.)

కావుననే గౌతముడు

అస్వతంత్రాధర్మే స్త్రీ.

(గౌ. 18-1)

(ధర్మవిషయములలో స్త్రీ యస్వతంత్రురాలు) అని చెప్పియున్నాడు.

వసిష్ఠు డిట్లు చెప్పుచున్నాడు.

అస్వతంత్రా స్త్రీ పురుషప్రధానా

(వసిష్ఠ. 5-1)

(స్త్రీ యస్వతంత్రురాలు. పురుషుడు ప్రధానుడుగా గలది.)

భర్త యనుజ్ఞనిచ్చుటచే స్త్రీకి కొన్ని ముఖ్యములగు ధర్మకార్యములను జేయుట కర్హత గల్గుచున్నది. కుమారుని దానమిచ్చుటకు కాని దత్తత చేసికొనుటకు గాని స్వతస్సిద్ధ