పుట:Womeninthesmrtis026349mbp.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

స్మృతికాలపుస్త్రీలు

(స్త్రీలు, బాలురు, పిచ్చివారు, వృద్ధులు, దరిద్రులు, రోగులు - వీరు తప్పుచేయుచో రాజు వేళ్లు, బద్దలు, త్రాళ్లు మున్నగువానితో కొట్టింపవలెను)

స్త్రీలయందతి కోపము చూపరాదని పరాశరుడు చెప్పుచున్నాడు.

స్త్రీ బాల నృవగోవిప్రేష్వతికోపం విసర్జయేత్

(పరాశర. 9-61)

సాధారణముగ స్త్రీలందఱును పూజింపతగినవారే.

    భర్తృభ్రాతృపితృ జ్ఞాతిశ్వశ్రూశ్వశురదేవరైః
    బంధుభిశ్చస్త్రియః పూజ్యాభూషణాచ్ఛాదనాశనైః
(యాజ్ఞ. 1-88)

(భర్తలు, భ్రాతలు, తండ్రులు, జ్ఞాతులు, మామలు, అత్తలు, మఱదులు, బంధువులు గూడ స్త్రీలను భూషణములతోను, భోజనములతోను, వస్త్రములతోను పూజింపవలెను.)

స్త్రీలు దేవతలవలె పూజింపతగినవారు. వారు పూజింపబడనిచోట దేవతలుగూడ సంతోషింపరు.

    యత్రనార్యస్తుపూజ్యన్తే రమన్తే తత్రదేవతాః
    యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రాఫలాఃక్రియాః
(మను. 3-56)

(స్త్రీలెచట పూజింపబడుచున్నారో దేవతలచట క్రీడింతురు. స్త్రీలెచట పూజింపబడరో యచట జరుగుక్రియలన్నియు నిష్పలములే యగును.)