పుట:Womeninthesmrtis026349mbp.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమాధ్యాయము

165

స్త్రీలను పలుకరించుటలో గూడ గౌరవమును గన్పఱుపవలెను.

    పరపత్నీతుయా స్త్రీస్యాదసంబంధాచయోనితః
    తాంబ్రూయాద్భవతిత్యేవం సుభగేభగినీతిచ
(మను. 2-129)

(రక్తబంధుత్వములేనట్టియు, పరునిభార్యయైనట్టియు స్త్రీని 'భవతి' పూజ్యురాలా - 'సుభగే' - సౌభాగ్యవంతు రాలా 'భగిని' - సోదరీ - యని సంబోధింపవలెను.)

మార్గమధ్యమున స్త్రీ యెదురగుచో పురుషుడు ప్రక్కకు తప్పుకొని యామెకు దారి యొసగునట్టి గౌరవము చేయవలెను.

వథూస్న్యాతకరాజభ్యః పథోవదనం

(గౌ. 6-24)

(స్త్రీకిని స్నాతకునకును రాజునకును మార్గము నీయవలెను.)

స్త్రీ కుపనయనము లేకపోవుటచే నామెకు బ్రహ్మణ్యసిద్ధి లేకపోవుటచే కాబోలు నామె బ్రాహ్మణవర్ణములో జన్మించినను బ్రాహ్మణ పురుషునకు గల పవిత్రత, ప్రాముఖ్యము నామె కంగీకరింపబడలేదు. బ్రాహ్మణుని చంపినచో మహాపాతకము వచ్చుననియు నది పతన హేతువనియు చెప్పబడినది. కాని బ్రాహ్మణ స్త్రీని చంపినచో నట్టిపాపము రాదు. కాని ఋతుస్నాతను జంపుచో నట్టిపాపమే వచ్చును.