పుట:Womeninthesmrtis026349mbp.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

స్మృతికాలపుస్త్రీలు

నతాభ్యామననుజ్ఞాతో ధర్మమేవ సమాచరేత్

(ఉనశ:1-36)

వర్జయిత్వాముక్తిఫలం నిత్యనైమిత్తికం తథా

(ఉశన: 1-37)

ఒక విశేషమేమన: తండ్రి పతితుడైనచో కుమారు డాతనిపట్ల భక్తి చూపనక్కర లేదు. కాని తల్లి పతితురాలైనను కుమారు డామెపట్ల భక్తి చూపవలసినదే. తల్లి దోషములను గూర్చి చింతించుటకైనను కుమారున కధికారములేదు.

పతితః పితా పరిత్యాజ్యో మాతాతుపుత్రేనపతతి

(వసిష్ఠ. 13-47)

(పతితుడైన తండ్రిని వదలివేయవలెను. తల్లి యన్ననో పుత్రునిదృష్టిలో నెన్నడును పతితురాలు కాదు.)

తలితండ్రులపట్ల నిట్లు గౌరవము కన్పఱుపవలసిన విధి పుత్రునకే చెప్పబడినది కాని కుమార్తెకు కాదు.. స్త్రీ కందఱ కంటెను భర్తయే యెక్కువవాడు.

పతిరేకః ప్రభుః స్త్రీణాం

(భర్త యొక్కడే స్త్రీకి ప్రభువు)

స్త్రీభిర్భర్తృవచః కార్యమేషధర్మః పరస్త్రియాః

(స్త్రీకి భర్తృవచనమును పాటించుటకంటెను నెక్కుడు ధర్మము లేదు.)