పుట:Womeninthesmrtis026349mbp.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమాధ్యాయము

159

(తల్లి ననుసరించి సమస్త జంతువులు జీవించునట్లు)

అను నొక యుపమానము వసిష్ఠస్మృతిలో వాడబడినది. తల్లి భరించునది కావునను భౌతికదేహమున కామె కారకురాలగుచున్నది. కావునను నామె భూదేవియొక్క రూపమని చెప్పబడినది. మఱియు సహనభావములో గూడ మాత పృథివిని పోలుచున్నది.

మాతామూర్తిఃపృథివ్యాస్తు

(మను. 2-225)

(తల్లి పృథివియొక్క మూర్తి)

అట్టి జీవహేతువైన తల్లిని పోషింపవలసిన విథి పుత్రునిపై గలదు. మనుస్మృతి పదునొకండవ యధ్యాయమున నుపపాతకములను జెప్పుచు.

గురుమాతృ పితృ త్యాగః

(మను 11-59)

అని గురుమాతృ పితృత్యాగమును గూడ నందుచేర్చినది. నూరు సంవత్సరములు సేవచేసినను తలిదండ్రుల ఋణము తీరదని మనుస్మృతి చెప్పుచున్నది.

     యంమాతాపితరౌ కౌక్లేశం సహేతే సంభవేనృణాం
     నతస్యనిష్కృతి శ్శక్యాకర్తుం వర్షశతైరపి
(మను. 2-227)

అవసరమగుచో నిత్యకర్మలను వదలియైనను తలిదండ్రులను సేవింపవలెను. అంతేకాదు. వారి యనుజ్ఞ లేనిదే ధర్మ కార్యములను జేయరాదు.