పుట:Womeninthesmrtis026349mbp.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమాధ్యాయము

157

తల్లి, తండ్రి, గురువునను మువ్వురపైనను భక్తిగల్గి యుండుట పరమధర్మము.

    ఇమంలోకంమాతృభక్త్యా పితృభక్త్యాతుమధ్యమం
    గురుశుశ్రూషయాత్వేవ బ్రహ్మలోకం సమశ్నుతే
(మను 2-233)

(ఈలోకమును మాతృభక్తిచేతను మధ్యమ లోకమును పితృభక్తిచేతను బ్రహ్మలోకమును గురుశుశ్రూషచేతను పొంద వచ్చును.)

    తఏవత్రయోలోకాస్తఏవ త్రయఆశ్రమాః
    తఏవత్రయోవేదాస్తఏవోక్తా స్త్రయోగ్నయః
(మను2-230)

(తల్లి, తండ్రి, గురువునను వారలే మూడు లోకములు, వారే మూడాశ్రమములు, వారే మూడు వేదములు, వారే మూడగ్నులు.)

ఈమువ్వురిలోను గూడ మాతయే హెచ్చుగ పూజ్యురాలు.

    ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాంశతంపితా
    సహస్రంతుపితౄన్మాతా గౌరవేణాతిరిచ్యతే
(మను 2-145)

(పదిమంది యుపాధ్యాయులకంటె నొక యాచార్యుడు హెచ్చు గౌరవార్హుడు. నూరుమంది యాచార్యులకంటె