పుట:Womeninthesmrtis026349mbp.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

153

    పితారక్షతి కౌమారే భర్తారక్షతి యౌవనే
    రక్షంతిస్థావిరే పుత్రాన స్త్రీస్వాతంత్ర్యమర్హతి.
(మను 9-3)

(స్త్రీని బాల్యములో తండ్రియు, యౌవనములో భర్తయు, వార్ధకములో పుత్రులును రక్షింపవలెను. స్త్రీ స్వాతంత్య్రమున కర్హురాలుకాదు.)

భర్త మరణించిన పిమ్మట స్త్రీకి పుత్రులతో బాటు భాగమువచ్చుటను పైన చూచియున్నాము. అయినను నామె పుత్రుని యధీనముననే యుండవలెను. వ్యభిచారిణియగు స్త్రీకి భర్త యాస్తిలో భాగమురాదు.

తామరిక్థ్యా ముపేయాత్

(వసిష్ఠ 13-53)

దాయభాగము పొంద నర్హులుకాని క్లీబాదులను వారి భార్యలను కూడ తక్కినవారు పోషింపవలెను. వారి పుత్రులు పెద్దవారగుచో పుత్రులే పోషింపవలెను. కాని యీ క్లీబాదుల భార్య లపుత్రులై వ్యభిచారిణులగుచో వారిని మిగిలినవారు పోషింపనక్కరలేదు.

    అపుత్రా యోషితశ్చైషాం భర్తవ్యా సాధువృత్తయః
    నిర్వాస్యా వ్యభిచారిణ్యః ప్రతికూలాస్త థైవచ
(యాజ్ఞ 2-140)

(అపుత్రులైన క్లీబ, పతిత, పంగూన్మత్త, జడాంధ చికిత్స్యరోగార్తుల భార్యలు మంచివారగుచో వారిని పోషింప