పుట:Womeninthesmrtis026349mbp.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

151

     నయోషిత్పతిపుత్రాభ్యాం నపుత్రేణ కృతంపితా
     దద్యాదృతే కుటుంబార్థాన్నపతిః స్త్రీకృతంతథా
(యాజ్ఞ 2-45)

(పతి,పుత్రుడు చేసిన కుటుంబార్ధము కాని ఋణమును స్త్రీ తీర్పనక్కరలేదు. అట్లే పుత్రునిచేత చేయబడిన ఋణమును తండ్రియు భార్యచేత చేయబడిన ఋణమును భర్తయు తీర్పనక్కరలేదు.)

మూడు విధములగు ఋణములను తీర్చుటకే స్త్రీకి విధికలదు.

     ప్రతిపన్నం స్త్రియాదేయం పత్యావాసహయత్కృతం
     స్వయంకృతం వాపియదృణం నాన్యం స్త్రీదాతుమర్హతి
(యాజ్ఞ 2-48)

(ఈ మూడు ఋణములను స్త్రీ తీర్పవలెను; (1) భర్త చనిపోవుచునే ఋణమును తీర్పవలసినదని భార్య కాదేశింపగా భార్య యందులకు సమ్మతించునో యాఋణము (2) భర్తతో కలసి చేసిన ఋణము (3) స్వయముగచేసిన ఋణము, మఱే ఋణమును స్త్రీ తీర్పనక్కర లేదు.)

స్త్రీ చేసిన ఋణమును పతి తీర్ప నక్కర లేదు. కాని యేకులములలో స్త్రీలు కూడ ధనసంపాదనము చేసి కుటుంబ యాత్రకు తోడ్పడుదురో యాకులములలో భార్యచేసిన ఋణమును భర్త తీర్పవలెనని యాజ్ఞవల్క్యుడు తెల్పుచున్నాడు.