పుట:Womeninthesmrtis026349mbp.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

స్మృతికాలపుస్త్రీలు

    నహిభర్తుర్వి ప్రవాసే నైమిత్తికే దానేస్తేయ
    ముపదిశంతి
(ఆ.ధ.సూ.2-14-20)

(భర్త ప్రవాసములో నుండగ నైమిత్తిక దానము చేయుట దొంగతనము కానేరదు.)

పైన తెల్పబడిన దాయరూపస్త్రీ ధనరూపమైన ధనముకాక మఱి యేవిధమగు ధనమును స్త్రీ యార్జించినను నాధనము భర్తదే యగును.

    భార్యాపుత్రశ్చదానశ్చత్రయ ఏనాధనాః స్మృతాః
    యత్తేసమధిగచ్ఛన్తి యస్యతేతస్య తద్ధనం
(మను. 8-416)

(భార్యా, పుత్రుడు, దాసుడు-ఈ మువ్వురకు వేరుగ ధనముండదు. వారేధనము సంపాదింతురో యాధనము వారెవనికి చెందుదురో వానిదే.)

ఇదివఱలో దాంపత్యమను ప్రకరణమున ధర్మార్థ కామములతో భార్యా భర్త లొకే వ్యక్తివలె నుండవలెనను నంశమును చూచి యుంటిమి. దాని ననుసరించియే పైన వివరింపబడిన ధనవిషయ కానుబంధము దంపతులకు గల్గు చున్నది. కాని ఋణవిషయములో నిట్టి సమాన భాధ్యత లేదు. భర్తృ మరణానన్తర మాతని ధనము నెల్ల పొందుటకు నపుత్రయగు భార్య కధికారమున్నది కాని యాతడు చేసిన ఋణమునెల్ల తీర్పవలెనను విధి యామెకు లేదు.