పుట:Womeninthesmrtis026349mbp.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

149

గుచో నది చక్కని సహత్వమగును. ద్రవ్యమును నిర్వహించుట యను పనిని భర్త భార్య కిచ్చునదియే కాని యామె కందుపై స్వతస్సిద్ధమగు నధికారము లేని మాట వాస్తవమే.

అర్ధస్య సంగ్ర హేచైనాం వ్యయేచైవనియోజియేత్

(మను. 9-11)

(ధనమును రక్షించుటయందును వ్యయపఱచుటయందును స్త్రీని నియోగింపవలెను.)

ఈవిధముగ భర్తచే నధికారములో ప్రతిష్ఠింపబడిన భార్య తన యధికారమును దుర్వినియోగము చేయరాదు. భర్త్రాజ్ఞలేనిదే కుటుంబధనము నుండి యలంకారాదులను చేయించుకొనరాదు.

    ననిర్హారం స్త్రీయఃకుర్యుః కుటుంబాద్బహమధ్యగాత్
    న్వకాదపి చవిత్తాద్ధి స్వస్యభర్తురనాజ్ఞయా
(మను. 9-199

(సోదరులు మన్నగువా రనేకులుగల కుటుంబము నుండి ధనమును సంగ్రహించి స్త్రీ లాభరణాదులను చేయించు కొనరాదు. తమ భర్త సొత్తునుండి యైనను నాతని యాజ్ఞ లేనిదే యలంకారాదులను చేయించుకొనరాదు.)

న్యాయములగు వ్యయములను జేయుట కామె కధికారము గలదు. భర్త గ్రామాంతరములో నున్నపుడు నైమిత్తిక దానములను జేయుటకు గూడ నామె కధికారమున్నది.