పుట:Womeninthesmrtis026349mbp.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

స్మృతికాలపుస్త్రీలు

మాత్రమే. అట్లే భర్త కెంతధనముపై నధికారమున్నను భార్యకు కూడ క్రియలో దానిపై నధికారము రాకతప్పదు. కాన నీసొత్తు భార్యది యీసొత్తు భర్తది యను విభాగమే సాధ్యము కాదు. కావుననే ఆపస్తంబు డిట్లు చెప్పుచున్నాడు.

జాయా పత్యోర్న విభాగోదృశ్యతే

(ఆ.ధ.సూ. 2-14-16)

(భార్యాభర్తలకు విభాగము లేదు.)

కాన నిఱువురకును నామమాత్రముగ వేర్వేరుగ నున్న సొత్తుపైన నిర్వురకు నధికారము గలదనియే చెప్పవలెను. ఈయంశ మీక్రింది సూత్రములలో స్పష్టము చేయబడినది.

కుటుంబి నౌధనస్యేశాతే

(ఆ.ధ.సూ. 1-29-3)

(భార్యాభర్త లిఱువురును ధనమున కధికారులు)

వారికి ద్రవ్యవిషయములో సమానస్వామిత్వము పాణిగ్రహణము వలననే కల్గుచున్నది. పాణిగ్రహణమువలన దంపతులకు కర్మలో సహత్వము గల్గునట్లే.

ద్రవ్యపరిగ్రహేషుచైవం.

(ఆ.ధ.సూ. 2-14-19)

ధనమును నిర్వహించుటలో గూడ సహత్వము వచ్చుచున్నదని యాపస్తంబుడు చెప్పుచున్నాడు. భర్త ధనము నార్జించుటయు భార్య యా ధనమును నిర్వహించుటయు జరు