పుట:Womeninthesmrtis026349mbp.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

147

స్త్రీ ధనము నపహరించుట మహాపాపముగ చెప్పబడినది. స్త్రీల వస్తువులనుకూడ నితరులు వాడుకొనరాదు.

    స్త్రీ ధనానితుయే మోహాదువజీవన్తి బాంధవాః
    నారీయానాని వస్త్రంవాతే పాపాయాన్త్యధోగతిం
(మను. 3-52)

(అజ్ఞానముచే స్త్రీ ధనము ననుభవించునట్టియు స్త్రీల వాహనములను వస్త్రములను నుపయోగించు నట్టియు బంధువులు పాపులు. వారథోగతికి పోదురు.)

కాని కొన్ని పరిస్థితులలో భార్యయొక్క ధనమును భర్త వాడుకొనవచ్చును.

    దుర్భిక్షే ధర్మకార్యేచవ్యాధౌసం ప్రతిరోధనే
    గృహీతం స్త్రీధనం భర్తానస్త్రియై దాతుమర్హతి
(యాజ్ఞ. 2-145)

(కఱువులోను, ధర్మకార్యములోను, వ్యాధిలోను, కష్టము నుండి తప్పించుకొనుటలోను భర్త భార్య ధనమును తీసికొనుచో నాత డాధనము నామెకు తిరిగి యీయనక్కరలేదు.)

భార్యాభర్త లిఱువురు నొకే సంసారము నిర్వహించు వారగుటచేతను నైహికాముష్మిక విషయములన్నిటిలోను సహత్వముగలవారగుట చేతను భర్తకు స్త్రీధనము వాడుకొను నధికారముండుటలో నాశ్చర్యము లేదు. భార్య సమస్త విషయములలోను భర్త కనువర్తనగ నుండవలెను గాన నామెకుగల పృథగ్ధనము నామ