పుట:Womeninthesmrtis026349mbp.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

స్మృతికాలపుస్త్రీలు

    అలంకారం నాదదీతపిత్య్రం కన్యాస్వయంపరా
    మాతృకం భ్రాతృదత్తం వాస్తేనాస్యాద్యదితం హరేత్
(మను.9-92)

భార్యయుండగ భర్త పునర్వివాహము చేసికొనుచో నాతని ద్వితీయ వివాహమునకగు వ్యయముతో సమమగు ధనమును ప్రథమ భార్య కీయవలెను. ఆమె కిదివఱకే కొంత స్త్రీధనమిచ్చియున్నచో నిపుడు దానిని తగ్గించి యీయవలెను.

    అధివిన్నః స్త్రియైదద్యాదాధివేదనికం సమం
    నదత్తం స్త్రీధనం యస్యైదత్వేత్వర్థం ప్రకల్పయేత్
(యాజ్ఞ. 1-146)

ఇవన్నియు స్త్రీకి ప్రత్యేకముగ చెందు ధనములే యై యున్నవి.

స్త్రీ ధనమును ప్రత్యేకశ్రద్ధతో కాపాడుట రాజు ధర్మము.

     వశాపుత్రానుచైవం స్యాద్రక్షణం నిష్కులాసుచ
     పతివ్రతాసుచ స్త్రీషు విధవాస్వాతురాసుచ
(మను. 8-28)

(బిడ్డలు లేక భర్తవలన భరణము కొనుచున్నట్టియు వంశహీనలైనట్టియు స్త్రీలయొక్కయు, పతివ్రతలయొక్కయు, విధవల యొక్కయు, రోగిణుల యొక్కయి ధనమును బాలుర ధనమువలె రాజు కాపాడవలెను.)