పుట:Womeninthesmrtis026349mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

141

తల్లియొక్క ధనము నామె యనంతరము కుమార్తెలు పంచుకొనవలెనని స్మృతులు చెప్పుచున్నవి.

మాతుర్దు హితరశ్శేషమృణాత్

(యాజ్ఞ. 2-121)

(తల్లి ధనమును కుమార్తెలు తీసికొని యామెకు ఋణమున్నచో దానిని తీర్చి వేయవలెను.)

మాతస్తుయౌతకం యత్స్యాత్కుమారీ భాగఏవసః

(మను. 9-121)

(తల్లి ధనము కుమార్తెదే.)

నారదు డిట్లు చెప్పుచున్నాడు:

మాతర్దు హితరో౽భావేదుహితౄణాం తదన్వయః

(నారద. 13-2)

(తల్లియొక్క ధనమును కుమార్తెలు పొందుదురు. కుమార్తెలు లేనిచో వారి వంశీయులు పొందుదురు.)

స్త్రీ దుహితృత్వములోనే కాక మాతృత్వములో గూడ నొక్కప్పుడు దాయమును పొందుట కర్హురాలు కాగలదని మనువు చెప్పుచున్నాడు. సంతతిలేని కుమారునిధనము తల్లికి చెందును.

     అనపత్యస్య పుత్రస్య మాతాదాయమవాప్నుయాత్
     మాతర్య పిచవృత్తాయాం పితుర్మాతాహరేద్ధనం
(మను. 9-217)