పుట:Womeninthesmrtis026349mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

స్మృతికాలపుస్త్రీలు

పెండ్లికాని భగినుల కిట్లు ధనమీయవలెనని చెప్పుటచే నీ ధనముతో వారికి పెండ్లిండ్లు చేయుట సోదరుల విధియని తేలుచున్నది. యజ్ఞవల్క్యస్మృతి యీ యంశమును స్పష్టముగ చెప్పుచున్నది.

    అసంస్కృతాస్తు సంస్కార్యాభ్రాతృభిః పూర్వసంస్కృతైః
    భగిన్యశ్చనిజాదం శాద్దత్వాంశంతు తురీయకం
(యాజ్ఞ. 2-122)

(సంస్కృతులైన సోదరులు వివాహితలుగాని తోబుట్టవులకు తమ భాగములోని నాల్గవయంశము నిచ్చి వివాహము చేయవలెను.)

అవివాహితగనున్న సోదరికి జ్యేష్ఠ కనిష్ఠసోదరులు దక్క మిగిలిన సోదరులతో సమానభాగము నీయవలెనని నారదుడు తెల్పుచున్నాడు.

    జ్యేష్ఠాయాం శోధికోజ్ఞేయః కనిష్ఠాయావరః స్మృతః
    సమాం శభాజశ్శేషాస్స్యురప్రత్తా భగినీతథా
(నారద. 13-13)

కన్యలకు మాతామహి ధనమునుండి కూడ కొంత యీయవలెనని మనువు చెప్పుచున్నాడు.

    యస్తాసాంస్యుర్దుహిత రస్తాసామపి యథార్హతః
    మాతా మహ్యాధనాత్కంచిత్ప్రదేయం ప్రీతిపూర్వకం
(మను. 9-193)