పుట:Womeninthesmrtis026349mbp.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

139

దౌహిత్రఏవచహరే దపుత్రస్యాఖిలంధనం

(మను 9-131)

(అపుత్రకుని ధనమును దౌహిత్రుడే పొందును)

ప్రథమాధ్యాయములో తెలుపబడినట్లు భ్రాతృదుహితపుత్రికగా చేయబడినపిమ్మట తండ్రికి పుత్రుడుగల్గుచో నాపుత్రుడును నామెయు తండ్రి ధనమును సమముగనే పంచుకొందురు. కాని పుత్రికకు జేష్ఠ్యాధిక్యము లేదు.

    పుత్రికాయాం కృతాయాంతు యదిపుత్రోనుజాయతే
    సమస్తత్రవిభాగస్స్యాత్ జ్యేష్ఠ తానాస్తిహిస్త్రియాః
(మను. 9-134)

అభ్రాతృదుహితయొక్క పుత్రికాత్వమును గూర్చి ప్రథమాధ్యాయములో పూర్తిగా వివరింపబడియే యున్నది.

సోదరులు దాయము పంచుకొనునప్పటికి వారి యక్కచెల్లెండ్రెవరైన నవివాహితలుగ నుండుచో వారికిగూడ కొంత ధనము వచ్చును.

    స్వేభ్యోం శేభ్యస్తుకన్యాభ్యః ప్రదద్యుర్భాతరః పృథక్
    స్వాత్స్వాదంశాచ్చతుర్భాగం పతితాస్స్యురదిత్సపః
(మను. 9-118)

(కన్యలకు సోదరులు తమతమ భాగములనుండి వేర్వేరుగా నాల్గవభాగము నీయవలెను. అట్లీయనిచో వారు పతితులగుదురు.)