పుట:Womeninthesmrtis026349mbp.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

స్మృతికాలపుస్త్రీలు

విభజేరన్సుతాః పిత్రోరూర్థ్వం రిక్థమృణంనమం

(యాజ్ఞ.2-114)

(తలిదండ్రుల యనంతరము పుత్రులు దాయమును ఋణమును సమముగా పంచుకొనవలెను.)

పితర్యూర్థ్వంగతే పుత్రావిభజేరన్ధ నంక్రమాత్

(నారద. 18-2)

(తండ్రి చనిపోయిన వాడగుచుండగా పుత్రులు ధనమును క్రమముగ పంచుకొనవలెను.)

కుమారులు లేనివాని పుత్రిక తన సంతతివలన తండ్రి వంశమును నిలబెట్టునని ప్రథమాధ్యాయమున జూచియుంటిమి. కాన నామెయే పుత్రస్థానము నాక్రమించుచున్నదని చెప్పవచ్చును. అందువలననే యపుత్రకుని ధనమాతని కుమార్తెకు వెళ్లునని చెప్పబడినది.

    యధైవాత్మతథాపుత్రః పుత్రేణదుహితాసమా
    తస్యాత్మనితిష్ఠన్త్యాంకథ మన్యోధనంహరేత్
(మను. 9-130)

(పురుషుడు తానే పుత్రుడగుచున్నాడు. కుమార్తె పుత్రునితో సమానురాలు, కాన నామె యుండగా మఱొకడెట్లు ధనము హరించును?)

అనగా పర్యవసానములో నామె పుత్రునకే ధనము వచ్చును.