పుట:Womeninthesmrtis026349mbp.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

133

చుండవలెను. భార్యలలో నెవతె వీరులను గనునో యెవతె యాజ్ఞను నెరవేర్చునో సమర్థురాలో, ప్రియభాషిణియో, పరిశుద్ధురాలో యామెనీ పనిలో నేర్పఱుపవలెను.)

ఇట్లు భర్తచేయుధర్మములలో పాల్గొని వానికి తోడ్పడుటకే కాని వేఱుగ నేకర్మచేయుటకు స్త్రీకి నధికారము లేదు. ఆమె యట్లు తోడ్పడనిచో పురుషుడు మఱొకభార్యను చేసికొనవలెనని పూర్వాధ్యాయమున జూచియుంటిమి. పెద్ద యజ్ఞయాగాదులమాట నటుంచి సామాన్యముగ నుపవాసములు మున్నగువానినిగూడ భార్య వేఱుగజేయరాదు.

నాస్త్రిస్త్రీణాం పృథక్ యజ్ఞోనవ్రతం నావ్యుపోషితం

(మను. 5-155)

తుదకాచమనము గూడ స్త్రీలకు శారీరకశుద్ధి కొఱకు మాత్రముపయోగించును.

    త్రిరాచామేదపః పూర్వం ద్విఃప్రమృజ్యాత్తతో ముఖం
    శారీరం శౌచమిచ్ఛన్‌హి స్త్రీశూద్రన్తుసకృత్సకృత్
(మను.5-39)

బ్రహ్మక్షత్రియ వైశ్యులకాచమనోదకము క్రమముగ నాభికంఠతాలు గతముకావలెను. స్త్రీ శూద్రులకు స్పృష్ట మాత్రమయిన చాలును.

స్త్రీశూద్రం స్పృష్టాభిరేవ,

(వశిష్ఠ 8-34)