పుట:Womeninthesmrtis026349mbp.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

స్మృతికాలపుస్త్రీలు

ఆశ్రమధర్మములలో గూడ స్త్రీపురుషులకు జాల భేదమున్నది.

స్త్రీకి బ్రహ్మచర్యాశ్రమము లేనట్లును పతిశుశ్రూషయే గురుకుల వాసమయినట్లును జూచియున్నాము. వానప్రస్థాశ్రమముగూడ స్త్రీకి వికల్పమే యైనట్లు (వనప్రస్థుడు భార్యను గూడ తీసికొని యైనను పోవచ్చుననియు లేదా యింటియొద్ద కుమారుల సన్నిధిని విడిచిపోనైనను వచ్చుననియు) పంచమాధ్యాయములో జూచియున్నాము. సన్యాసాశ్రమము స్త్రీలకు లేదు. సన్యాసినియగు స్త్రీ పతితురా లగునని కలదు.

    "జవస్తప స్తీర్థయాత్రాప్రవ్రజ్యామన్త్రసాధనం |
    దేవతారాధనం చైవ స్త్రీ శూద్రపతితానిషట్"
(అత్రి 135)

(జపము, తపము, తీర్థయాత్ర, సన్యాసము, మన్త్రోపాసన, దేవతారాథనము అను నాఱును స్త్రీలకు శూద్రులకును పతితత్వమును కల్గించును.)

భర్తృసహిత కాకుండ జపతపస్తీర్థయాత్ర, దేవతారాధనలను గూడ జేయరాదను నీభావముపైన నీయబడిన "నాస్తి స్త్రీణాం వృధక్ యజ్ఞ:" అనుదానిలోనే యున్నది.

స్త్రీలు ప్రాయశ్చిత్తరూపములగు చాంద్రాయణము మున్నగు వ్రతములను ప్రత్యేకముగ జేయవలసి యుండును. ఆవ్రతములనైనను వారు గృహమునకు బయటను బంధుపరోక్షమునను జేయరాదు.