పుట:Womeninthesmrtis026349mbp.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

స్మృతికాలపుస్త్రీలు

శ్రౌతకార్యములలో నగ్నిమథనమునకై పత్నులను నియోగింపవలెను.

"కార్యమగ్నిచ్యుతేరాభిః సాధ్వీభిర్మథనంపునః.

(కాత్యా 8-6)

గృహస్థుప్రవాసమున కేగి నపుడగ్నులను నిర్వహించు బాధ్యత గృహిణిపై గలదు. శ్రాద్ధములోవలెనే నిటగూడ నామె యితరులతో జేయింపవలసినదే కాని తాను జేయుటకు వీలులేదు. కానఋత్విక్కు కావలెను. గృహస్థేయాఋత్విక్కును నియమించి వెళ్లును.

    "నిక్షిప్యాగ్నిం స్వదారేషుపరికల్ప్యర్త్విజంతథా
    ప్రవసేత్కార్యవాన్ విప్రోవృధైవనచిరం క్వచిత్
    వత్న్యాచాప్యవియోగిన్యా శ్రూష్యోగ్నిర్వినీతయా
    సౌభాగ్యవిత్తావైధవ్యకామ యాభర్తృభుక్తయా
    యావాస్యొద్వీరసూరాసామజ్ఞా సంపాదినీచయా
    దక్షాప్రియం వదాశుద్ధాతామత్ర వినియోజయేత్.
(కాత్యా. 19-1,3,4)

(పనిగల్గి ప్రవాసముపోవు విప్రుడు అగ్నులను భార్య కొప్పగించి ఋత్విక్కు నేర్పఱిచిపోవలెను. వ్యర్థముగా నెచ్చటను నిలువరాదు. వినయము గల్గినట్టియు, సౌభాగ్య ధనములను నయిదవతనమును భర్తృ సహవాసమును గోరు నట్టియు స్త్రీ యెన్నడును వీడక యాయగ్నులను సేవించు