పుట:Womeninthesmrtis026349mbp.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

131

చేసికొనవలెను. ప్రథమభార్యజీవించియుండగా రెండవభార్య చనిపోవుచో నామెను వైతానికాగ్నులతో దహింపచేయుచో నది బ్రహ్మహత్యాతుల్యపాపమగును.)

భార్య చనిపోయినపుడామెతో పాత్రలను నగ్నులను దహింపజేయవలెనని చెప్పుటచే శ్రౌతకర్మప్రయోజనము చాలవఱకు పూర్వమారణియైన భార్యకే ముట్టుచున్నదని తెలియుచున్నది. ఆమె పోయినపిమ్మట పురుషుడిక నాహితాగ్ని కానే కాడు. సాయంప్రాతరగ్నిహోత్రములను దర్శపూర్ణమా సేష్టులను చేయుట కాతని కధికారము లేదు. ద్వితీయభార్యను గైకొనినను నాతని కధికారములేదు. ఆమెతో మఱల నాధానము చేయవలసినదే.

దీనినిబట్టి యజ్ఞఫలము నొందుటలో స్త్రీ పురుషునికంటె తక్కువయర్హురాలు కాదని తెలియుచున్నది. ఒకభార్యను వివాహమాడిన పిమ్మట నామె మరణించినను మఱొక భార్యను జేసికొనకుండ నామె ప్రతిమతో ధర్మకార్యములను జేయవచ్చునని కొలదిస్మృతులు చెప్పుచున్నవి. రాముడు సీతాప్రతిమతో క్రతువులు చేయలేదా?

    "మృతాయామపిభార్యాయాం వైదికాగ్నిం నహిత్యజేత్
    ఉపాధినాపి తత్కర్మయావజ్జీవం సమావయేత్
    రామోపికృత్వా సౌవర్ణాంసీతాం పత్నీంయశస్వినీం
    ఈజేయజ్ఞెర్బహువిధైస్సహ భ్రాతృభిరావృతః
(కాత్యా 20-9,10)