పుట:Womeninthesmrtis026349mbp.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

స్మృతికాలపుస్త్రీలు

(భర్త బ్రతికియుండగ సేవచేయవలెను. చనిపోయిన పిమ్మట గూడ నతిక్రమింపరాదు.)

షష్టాధ్యాయములో వివరింపబడిన 'ప్రేతపత్నీ షణ్మాసాన్‌' మున్నగు వశిష్ఠసూత్రములో గూడ నీయంశము స్పష్టముగ నున్నది.

స్త్రీ స్వయముగ శ్రాద్ధకర్మ చేయలేదు. ఏలన:

'నస్త్రీజు హుయాత్‌'

(స్త్రీ హోమముచేయరాదు.)

అను నియమముగలదు. అంతేకాదు. భర్తృరహితయగు స్త్రీకేకర్మ చేయుటకు నధికారములేదు. మనువు వితంతువులను గూర్చి "లుప్తధర్మ క్రియాహితాః" (వారులోపించిన ధర్మక్రియగలవారు.) అని చెప్పినట్లు పూర్వాధ్యాయములో చూచియుంటిమి. పాణిగ్రహణమువలన స్త్రీ భర్తతో కర్మచేయుట కర్హురాలగుచున్నది. అతడు చనిపోవుచో నామెకాకర్మ సహత్వము కూడ పోవుచున్నది. ఆమె స్వతంత్రముగ కర్మచెయరాదా? యన

'అస్వతంత్రా ధర్మే స్త్రీ

(గౌ. 18-1)

(ధర్మము విషయమున స్త్రీ యస్వతంత్రురాలు) అని చెప్పబడినది.

పురుషుడయినను తానొక్కడే క్రతువును జేయరాదు. గృహస్థాశ్రమములో నున్నపుడే యనగా భార్యతో నున్నపుడే యాతడు యజ్ఞములను జేయుట కర్హుడనియు భార్యారహితు