పుట:Womeninthesmrtis026349mbp.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

129

డైనచో నాతడు యజ్ఞములను చేయుట కనర్హుడనియు గృహమునువీడి యరణ్యమునకు బోవలసినవాడేయనియు పంచమాధ్యాయమున జూచియుంటిమి. ఇట్లు కర్మలలో పాల్గొనవలసినది జ్యేష్ఠ భార్యయేనా? యున్న భార్యలందరును గూడనా ? యననావిషయమై స్మృతులలో నభిప్రాయభేదము గలదు. ప్రథమ భార్య ధర్మప్రజా సంపన్నయై యుండగా రెండవ భార్యను జేసికొనుట కేవలము నింద్రియసుఖముకొఱకే యనియు నామె ధర్మకార్యముల కక్కరకురాదనియు పూర్వాధ్యాయమున చూచియుంటిమి. పరాశరస్మృతి యిట్లు చెప్పుచున్నది.

'సవర్ణాసు విధౌధర్మే జ్యేష్ఠయాన వినేతరా'

(పరాశర. 4-89)

(ధర్మములో భర్తతో నుండదగినది సవర్ణ భార్యలలో జ్యేష్ఠయే.)

ఎంతమంది భార్యలున్న నంతమందితోను కలిసియే క్రతువులను జేయవలెనని కొన్ని స్మృతులలో గలదు.

"నైకయాపి వినాకార్య మాధానం భార్యయాద్విజైః'

(కాత్యాయన 8-5)

(ద్విజుడొక భార్యను గూడ విడువకుండ యందఱు భార్యలతోను నాధానము చేయవలెను)