పుట:Womeninthesmrtis026349mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

127

(అమావాస్యనాడు పితామహునుద్దేశించి బ్రాహ్మణుని బ్రాహ్మణస్త్రీని నర్చనచేయుచో పాపములుపోవును.)

కుమారుడుగలుగవలెనని కోరుచున్న స్త్రీశ్రాద్ధములో మధ్యమపిండమును తినవచ్చునట.

    'ప్రతివ్రతాధర్మపత్నీ పితృపూజనతత్పరా
     మధ్యమంతుతతఃపిండమధ్యాత్సమ్యక్సుతార్థినీ'
(మను 3-262)

(ప్రతివ్రతయు, ధర్మపత్నియు, పితృపూజనతత్పరియు, సుతులను కోరునట్టియు స్త్రీమధ్యమ పిండమును తినవలెను) అట్లుతినుచోనామె

    ఆయష్మంతం సుతంసూతే యశోమేధాసమన్వితం
    ధనవంతం ప్రజావంతం సాత్వికం ధార్మికంతథా'
(మను 3-263)

(ఆయుష్మంతుడు, యశోవంతుడు, మేధావంతుడు, ధనవంతుడు, సంతానవంతుడు, సాత్వికుడు, ధార్మికుడు నగు పుత్రుని కనును.)

వితంతువు భర్తకు శ్రాద్ధాదికములను చేయించు చుండ వలెను.

     'తంశుశ్రూషే తజీవంతం
      సంస్థితం చనలంఘయేత్‌'
(మను 5-151)