పుట:Womeninthesmrtis026349mbp.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

స్మృతికాలపుస్త్రీలు

మును వీడి మఱియొక కులమునకు వెళ్ళిపోయిన (చెడిపోయిన) స్త్రీలకు' అని చెప్పుచున్నారు.

చౌలమై మృతినొందిన స్త్రీకిని పురుషునకును గూడ నపిండు లుదకదాన మీయవలెను.

    'ఉదకదానం నపిండైః కృతజటస్య '
    'తత్త్ప్రీణాంచ'
(గౌ. 14-34-35)

వివాహమయిన స్త్రీలకు భర్తృపక్షమువారే యుదకదానము చేయవలెనని కొందఱును పితృపక్షము వారుకూడ చేయవచ్చునని కొందఱును చెప్పుచున్నారు.

'ఏకే౽ప్రత్తానాం,

(గౌ. 14-34-36)

పురుషుల విషయమున నపిండత్వము సాప్తపురుషమనియు స్త్రీలవిషయమున త్రిపురుషమనియు వసిష్ఠుడు చెప్పుచున్నాడు.

'ప్రత్తాణాంచ స్త్రీణాం త్రిపురుషం విజ్ఞాయతే'

(వసిష్ఠ 4-18)

శ్రాద్ధభోక్తృత్వమున కుపనీతుడే యర్హుడైనను పితరుల నుద్దేశించి స్త్రీనిగూడ గూర్చుండబెట్టుట లేకపోలేదు.

    "అమావాస్యాయాం బ్రాహ్మణం సముద్దిశ్యపితామహం
     బ్రాహ్మణీం స్త్రీం సమభ్యర్చ్యముచ్యతే నర్వపాతకైః"
(ఉశన:. 105)