పుట:Womeninthesmrtis026349mbp.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాధ్యాయము

125

     'మాతుస్సపిండీకరణం పితామహ్యాసహోదిత:
      యథోక్తేనైవకల్పేన పుత్రికాయానచేత్సుత:'
(కాత్యా 16-21)

పుత్రికాపుత్రుడెట్లు చేయవలెనో ప్రథమాధ్యాయముననే చూచియున్నాము. సవతులలో నొకతె పుత్రవంతురాలగునేని యందఱును పుత్రవంతురాండ్రే యైనట్లు పూర్వాధ్యాయమున జూచియుంటిమి. దానింబట్టి సవతితల్లులకు గూడ శ్రాద్ధాదికము చేయవలెనని తేలుచున్నది.

వివాహముకాని స్త్రీలకు నుపనయనము కాని పురుషులకువలెనే పిండదానము లేదు.

    "ఆసంస్కృతప్రమీతానాం త్యాగినాం కులయోషితాం
     ఉచ్ఛిష్టభాగధేయం స్యాద్దర్భేషువికిరశ్చయ:"
(మను 3-245)

(ఉపనయన సంస్కారము జరుగకుండ చనిపోయినవారికిని, తల్లిదండ్రులు మున్నగువారిని వదలివైచినవారికిని వివాహము కాకుండ పితృకులమున నుండగనే మరణించిన స్త్రీలకును దర్భలయందు చిమ్మబడిన యుచ్ఛిష్టమే భాగధేయము)

ఇచట 'కులయోషితాం త్యాగినాం', అనుదానికి 'మంచి భార్యలను విడిచిపెట్టినవారికి, అని యర్థమని కొందఱు చెప్పుచున్నారు. మఱికొందఱు 'కులయోషితాం', అనగా స్వకుల