పుట:Womeninthesmrtis026349mbp.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

స్మృతికాలపుస్త్రీలు

నామకరణములో స్త్రీకి బేసిసంఖ్యగల యక్షరముల పేరు నిడవలెను.

'అయుజాక్షరంకుమార్యాః'

(ఆ.గృ. 6-15-11)

పుత్రుడు కల్గుచో తండ్రి ప్రవాసమునుండి వచ్చి "అంగాదంగాత్" అనునట్టియు "అశ్మాభవ" అనునట్టియు ఋక్కులచే వాని నభిమంత్రించి వాని శిరన్సుమూర్కొని, వానికుడి చెవిలో "అగ్నిరాయుష్మాన్" మున్నగు మంత్రములను చదువవలెను. స్త్రీ శిశువు గల్గుచో నివియేవియు నుండవు. "సర్వస్వాదాత్మనః" అను మంత్రముచే దాని నభిమంత్రింపవలెను. ఈ క్రింది సూత్రముల కిదేయర్థము.

   "ప్రవాసాదేత్యపుత్రస్యోత్తరాభ్యా మభిమంత్రణం
    మార్ధన్యవఘ్రాణం దక్షిణేకర్ణ ఉత్తరాన్ మంత్రాన్ జపేత్
    కుమారీముత్తరేణయజుషాభి మంత్రయతే"
(ఆ.గృ. 6-15-12, 13)

ప్రేతకర్మశ్రాద్ధములను స్త్రీలకు గూడ పురుషులకువలెనే చేయవలెను. అందేమియు భేదము చెప్పబడలేదు.సపిండీకరణము తండ్రికి పితామహప్రపితా మహులతోను తల్లికి పితామహీప్రపితా మహులతోను చేయవలెను. పుత్రికా సుతుడిట్లు చేయరాదు